Recipe in Telugu

తెలుగు వంటలు

Learn Authentic Telugu Recipes – In English & Telugu

Bagara Rice Recipe (Telangana Style)

Last updated on 17th July, 2025 by

Learn how to make Bagara Rice, a flavorful South Indian rice made with spices and herbs, perfect for festivals, functions, or with curries and gravies.

Bagara Rice is a spiced rice delicacy from Hyderabad, Telangana, India. The word Bagar means tempering, and this dish is often referred to as a “plain biryani” since it is made without vegetables or heavy masala powders. Despite its simplicity, the richness of whole spices, fried onions, and herbs makes it aromatic and delicious. Traditionally served at weddings, festive gatherings, and family functions across Telangana, Bagara Rice is best enjoyed with gravies like Bagara Baingan, kurma, or paneer curries. It is also quick to prepare, making it a favorite for both special occasions and everyday meals.

Ingredients

  • Basmati rice – 1 cup
  • Oil or ghee – 2 tbsp
  • Bay leaf – 1
  • Cinnamon – 1 inch
  • Cloves – 3
  • Cardamom – 2
  • Star anise – 1
  • Shah jeera (black cumin) – ½ tsp
  • Green chillies – 3 (slit)
  • Ginger garlic paste – 1 tsp
  • Onion – 1 (thinly sliced)
  • Mint leaves – handful
  • Coriander leaves – handful
  • Water – 1¾ cups
  • Salt – to taste

Preparation

  1. Wash and soak basmati rice for 20–30 minutes.
  2. Heat oil or ghee in a pan or pressure cooker.
  3. Add bay leaf, cinnamon, cloves, cardamom, star anise, shah jeera. Fry until aromatic.
  4. Add green chillies, sliced onions. Saute until golden brown.
  5. Add ginger garlic paste and fry till raw smell disappears.
  6. Add mint and coriander leaves. Saute for a minute.
  7. Add soaked rice (drained) and Saute gently for 2 minutes.
  8. Pour water and add salt.
  9. Cook covered until rice is soft and fluffy (1 whistle if using pressure cooker, or simmer on stove).
  10. Serve hot.

Health Benefits

  • Uses less oil and spices compared to biryani, making it light on the stomach.
  • Spices like cardamom, cloves, and cinnamon aid digestion and boost immunity.
  • Mint and coriander leaves provide antioxidants and act as natural detoxifiers.
  • Basmati rice provides quick energy and helps keep you full for longer.
  • Suitable for kids and elders since it doesn’t contain heavy masala powders.
  • Can be paired with protein-rich curries (like dal or paneer) to make a balanced meal.

Tips

  • Soak basmati rice for at least 20–30 minutes to get fluffy, separate grains.
  • Fry onions until golden brown for authentic Hyderabadi-style flavor.
  • Use ghee instead of oil for a richer taste.
  • Adjust green chillies according to spice preference.
  • Always use whole spices (not powders) to maintain the traditional aroma.
  • For large gatherings, cook in a wide vessel for even texture.

Variations 

  • Bagara with Coconut Milk – Add coconut milk instead of water for a rich, festive version.
  • Veg Bagara Rice – Add peas, beans, or carrots for a vegetable-loaded variation.
  • Non-Veg Bagara Rice – Pair with chicken/mutton gravy or lightly mix in cooked meat.
  • Dry Fruits Bagara Rice – Add fried cashews and raisins for weddings and functions.
  • Curd Bagara Rice – Serve with spicy dahi-based gravies for a cooling balance.


 

బగారా అన్నం తెలంగాణ ప్రసిద్ధ వంటకం. బగార్ అంటే తాలింపు అని అర్థం. దీనిని “సాధారణ బిర్యాని” అని కూడా అంటారు, ఎందుకంటే ఇందులో కూరగాయలు లేదా బలమైన మసాలా పొడులు ఉపయోగించరు. అయితే సుగంధ ద్రవ్యాలు, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర-పుదీనా వాసనతో ఈ వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. వివాహాలు, విందులు, పండుగ సందర్భాలలో సాధారణంగా వడ్డించే ఈ అన్నం బగారా బైగన్, కుర్మా, పన్నీర్ కర్రీలతో తింటే మరింత రుచిగా ఉంటుంది. తక్కువ సమయంతో తయారయ్యే కారణంగా, రోజువారీ భోజనానికి కూడా ఇది అనువైనది.

కావలసిన పదార్థాలు

  • బాస్మతి బియ్యం– 1 కప్పు
  • నెయ్యి లేదా నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • బిర్యాని ఆకు– 1
  • దాల్చిన చెక్క – 1 అంగుళం
  • లవంగాలు – 3
  • ఏలకులు – 2
  • స్టార్ అనిస్ – 1
  • షాజీరా – ½ టీస్పూన్
  • పచ్చిమిర్చి – 3 (పొడవుగా కట్ చేయాలి)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  • ఉల్లి – 1 (స్లైస్ చేయాలి)
  • పుదీనా ఆకులు – కొద్దిగా
  • కొత్తిమీర ఆకులు – కొద్దిగా
  • నీరు – 1¾ కప్పులు
  • ఉప్పు – తగినంత

తయారీ విధానం

  1. బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టి నీరు వడకాలి.
  2. కుక్కర్ లేదా పాన్ లో నెయ్యి వేసి వేడిచేయాలి.
  3. బే లీవ్, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, స్టార్ అనిస్, షాజీరా వేయాలి.
  4. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపాలి.
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలపాలి.
  6. పుదినా, కొత్తిమీర ఆకులు వేసి తక్కువ వేడి మీద వేయాలి.
  7. తర్వాత బియ్యం వేసి మెల్లగా కలపాలి.
  8. నీరు, ఉప్పు వేసి కుక్కర్ లో ఒక విజిల్ లేదా మిగతా మాదిరిగా ఉడకబెట్టాలి.
  9.  వేడి వేడిగా వడ్డించండి.

ఆరోగ్య ప్రయోజనాలు

  • బిర్యానితో పోలిస్తే తక్కువ నూనె, తక్కువ మసాలాలతో ఉండి కడుపుకు తేలికగా ఉంటుంది.
  • లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి.
  • పుదీనా, కొత్తిమీర శరీరానికి చల్లదనం కలిగించి డిటాక్స్ చేస్తాయి.
  • బాస్మతి అన్నం శీఘ్ర శక్తినిస్తుంది మరియు ఆకలి నియంత్రిస్తుంది.
  • పిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినగలిగే వంటకం.
  • ప్రోటీన్ ఉన్న కర్రీలతో తింటే ఇది పూర్తి భోజనంగా మారుతుంది.

సూచనలు

  • అన్నం వండే ముందు కనీసం 20–30 నిమిషాలు నానబెట్టాలి.
  • ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయిస్తే హైదరాబాదు రుచి వస్తుంది.
  • నూనె బదులుగా నెయ్యి వాడితే రుచి మరింత బాగుంటుంది.
  • పచ్చిమిర్చి మోతాదును రుచి ప్రకారం తగ్గించవచ్చు/పెంచవచ్చు.
  • పొడి మసాలాల బదులుగా సుగంధ ద్రవ్యాలు వాడితే మంచి సువాసన వస్తుంది.
  • ఎక్కువ మంది కోసం వండేటప్పుడు వెడల్పాటి పాత్ర వాడితే అన్నం సమంగా ఉడుకుతుంది.

రకాలు

  • కొబ్బరి పాల బగారా అన్నం – నీటికి బదులుగా కొబ్బరి పాలు వేసి రుచిగా తయారు చేయవచ్చు.
  • కూరగాయల బగారా అన్నం – బఠాణీలు, బీన్స్, క్యారెట్ వేసి వెజ్ వెర్షన్ గా చేయవచ్చు.
  • నాన్ వెజ్ బగారా అన్నం – చికెన్/మటన్ కర్రీతో కలిపి వడ్డించవచ్చు.
  • డ్రై ఫ్రూట్స్ బగారా అన్నం – జీడి పప్పు, కిస్మిస్ వేసి పెళ్లిళ్లలో వడ్డిస్తారు.
  • దహి బగారా అన్నం – మసాలా పెరుగు కర్రీలతో వడ్డిస్తే చల్లగా ఉంటుంది.