Recipe in Telugu

తెలుగు వంటలు

Learn Authentic Telugu Recipes – In English & Telugu

Bellam Kudumulu Recipe

Last updated on 30th June, 2025 by

Learn how to make Bellam Kudumulu, a traditional sweet rice dumpling made with jaggery and rice flour. A perfect prasadam for Vinayaka Chavithi and festivals.

Bellam Kudumulu is a traditional Andhra-style sweet made with rice flour, jaggery, and cardamom. It is mainly prepared as naivedyam (offering) during festivals like Vinayaka Chavithi (Ganesh Chaturthi), Varalakshmi Vratam, Toli Ekadasi, Atla Taddi, and Navratri. These soft, mildly sweet dumplings are steamed, making them a healthy festive treat.

Ingredients

  • Rice flour – 1 cup
  • Grated jaggery – ¾ cup
  • Water – 1 to 1¼ cups
  • Grated coconut – 2 tbsp
  • Cardamom powder – ½ tsp
  • Ghee – 1 tsp
  • A pinch of salt
  • Chana dal (soaked 2 tbsp for 1–2 hrs and boiled)

Preparation Method

  1. Soak chana dal for 1–2 hours and boil until soft but not mushy.
  2. In a pan, boil water with jaggery until fully melted. Strain to remove impurities.
  3. Add salt, ghee, cardamom powder, boiled chana dal, and grated coconut to the jaggery water. Let it simmer for 1 minute.
  4. Lower the flame and add rice flour slowly, stirring continuously to avoid lumps.
  5. Cook the mixture into a soft dough. Allow it to cool.
  6. Grease hands and shape into small balls or discs.
  7. Steam for 10–12 minutes. Serve Kudumulu warm.

Health Benefits

  • Jaggery (Bellam) is rich in iron and helps prevent anemia. It also aids digestion and improves energy levels.
  • Rice flour provides carbohydrates, keeping you energetic during fasting and festive rituals.
  • Chana dal adds plant-based protein and fiber, supporting muscle strength and digestion.
  • Steaming method makes the dish oil-free and light, suitable for all age groups.
  • Coconut provides healthy fats and minerals that boost immunity.

Tips

  • Always strain jaggery syrup to remove impurities for a clean taste.
  • Use slightly coarse rice flour for better texture.
  • Grease hands with ghee before shaping to avoid sticking.
  • Don’t overcook chana dal – it should be soft but hold its shape.
  • Kudumulu taste best when served warm after steaming.

Variations

  • Sesame Kudumulu: Add roasted sesame seeds along with jaggery for a nutty flavor.
  • Dry fruit version: Mix chopped cashews, almonds, or raisins for a festive richness.
  • No coconut version: Skip coconut if you want longer shelf life.
  • Vegan version: Use oil instead of ghee for shaping and steaming.
  • Savory Kudumulu: Prepare without jaggery, adding green chilies, ginger, and tempering for a salty version.

 


 

బెల్లం కుడుములు అనేవి బియ్యం పిండి, బెల్లం, యాలకుల పొడి తో తయారయ్యే సంప్రదాయ ఆంధ్రా స్వీటు. ఇవి ముఖ్యంగా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం,తొలి ఏకాదశి,అట్ల తద్ది, మరియు నవరాత్రులు వంటి పండుగల సందర్భంగా నైవేద్యంగా తయారు చేస్తారు. ఆవిలో వండే ఈ మృదువైన స్వీటు ఆరోగ్యకరమైనదిగా కూడా భావించబడుతుంది.

పదార్థాలు

  • బియ్యం పిండి – 1 కప్పు
  • తురిమిన బెల్లం – ¾ కప్పు
  • నీరు – 1 నుండి 1¼ కప్పులు
  • తురిమిన కొబ్బరి – 2 టీస్పూన్లు
  • యాలకుల పొడి – ½ టీస్పూన్
  • నెయ్యి – 1 టీస్పూన్
  • ఉప్పు – తగినంత
  • శనగపప్పు– 2 టీస్పూన్లు (నానబెట్టి, ఉడక పెట్టాలి)

తయారీ విధానం

  1. ముందుగా శనగపప్పును 1–2 గంటలు నానబెట్టి ఉడక పెట్టాలి(మొత్తగాకాకుండా).
  2. ఒక పాత్రలో నీటిలో బెల్లం వేసి మెత్తగా కరిగే వరకు మరిగించాలి. వడకట్టాలి.
  3. ఆ బెల్లం నీటిలో ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి,ఉడికిన శనగపప్పు, తురిమిన కొబ్బరి వేసి ఒక నిమిషం మరిగించాలి.
  4. అప్పుడు నెమ్మదిగా బియ్యం పిండి వేసి ముద్దలా అయ్యే వరకు కలపాలి.
  5. మిశ్రమం చల్లారిన తర్వాత ఉండలు చేయాలి.
  6. స్టీమర్‌లో 10–12 నిమిషాలు ఆవిలో ఉడక పెట్టాలి.
  7. వేడి వేడిగా  కుడుములు ప్రసాదంగా వడ్డించండి.

ఆరోగ్య ప్రయోజనాలు

  • బెల్లం లో ఐరన్ ఎక్కువగా ఉండటంతో రక్తహీనతను తగ్గిస్తుంది మరియు శక్తిని ఇస్తుంది.
  • బియ్యం పిండి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ అందిస్తుంది.
  • శెనగ పప్పు ప్రోటీన్, ఫైబర్ కలిగినది, ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
  • ఆవిరి వంట కావడంతో నూనె అవసరం ఉండదు, అన్ని వయసువారికి అనుకూలం.
  • కొబ్బరి లో ఉండే మంచి కొవ్వులు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సూచనలు

  • బెల్లం నీరు ఎప్పుడూ వడకట్టి వాడాలి.
  • కొంచెం రవ్వలాగా ఉండే బియ్యం పిండి వాడితే మంచి రుచి వస్తుంది.
  • ముద్దలు చేసేప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటే అతుక్కోవు.
  • శెనగ పప్పు మృదువుగా ఉండాలి కానీ కరిగిపోకుండా ఉడికించాలి.
  • వేడి వేడిగా వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది.

వైవిధ్యాలు

  • నువ్వుల కుడుములు: బెల్లం నీటిలో వేయించిన నువ్వులు వేసి ప్రత్యేక రుచి తెచ్చుకోవచ్చు.
  • డ్రై ఫ్రూట్స్ కుడుములు: జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి ఉత్సవ వంటకం లా చేయవచ్చు.
  • కొబ్బరి లేకుండా: కొబ్బరి వాడకపోతే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి.
  • వీగన్ వెర్షన్: నెయ్యి బదులు నూనె వాడవచ్చు.
  • కారం కుడుములు: బెల్లం లేకుండా, పచ్చిమిర్చి, అల్లం, తాలింపు వేసి ఉప్పు రుచిలో కుడుములు చేయవచ్చు.