Cauliflower Tomato Curry is a simple, home-style dish perfect for busy days. It combines boiled cauliflower and juicy tomatoes with minimal spices. This curry pairs well with rice, chapati, or even as a light dinner option. Easy to cook, healthy, and suitable for kids and adults alike.
Cauliflower Tomato Curry
Ingredients:
- Cauliflower – 1 medium (cut into florets)
- Tomatoes – 2 (chopped)
- Onion – 1 (chopped)
- Green chilli – 1 (slit)
- Ginger garlic paste – 1 tsp
- Turmeric powder – ¼ tsp
- Red chilli powder – 1 tsp
- Coriander powder – 1 tsp
- Garam masala – ½ tsp
- Salt – as required
- Water – ½ cup
- Oil – 2 tbsp
- Coriander leaves – for garnish
Preparation:
- Boil cauliflower florets in salted hot water for 3–4 mins. Drain and set aside.
- Heat oil in a pan. Add onions and green chilli, saute until golden.
- Add ginger garlic paste and cook till raw smell disappears.
- Add chopped tomatoes and cook till soft and mushy.
- Add turmeric, red chilli powder, coriander powder, and salt. Mix well.
- Add cauliflower florets and ½ cup water. Cover and cook for 8–10 minutes.
- Sprinkle garam masala and garnish with coriander leaves. Serve hot.
Health Benefits:
- Rich in Fiber – Cauliflower supports digestion and helps prevent constipation.
- Low in Calories – Ideal for weight watchers as it’s light yet filling.
- Packed with Vitamins – Cauliflower has Vitamin C, K, and B6 which help boost immunity and bone health.
- Antioxidant Properties –Tomatoes contain lycopene and other antioxidants that reduce inflammation and support heart health.
- Improves Skin and Vision – The nutrients in tomatoes help maintain healthy skin and good eyesight.
కాలిఫ్లవర్ టమాటా కూర అనేది తేలికగా తయారయ్యే కూర. ఉడికించిన కాలిఫ్లవర్, టమాటాలతో కలిపి కొద్దిపాటి మసాలాలతో తయారవుతుంది. ఇది అన్నం, రోటీ, చపాతీలతో బాగా సరిపోతుంది. ఆరోగ్యంగా ఉండే ఈ కూర చిన్నపిల్లలు, పెద్దలకు అనువుగా ఉంటుంది. త్వరగా తయారవుతుంది.
కాలిఫ్లవర్ టమాటా కూర తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
- కాలిఫ్లవర్ – 1 (ముక్కలుగా కట్ చేయండి)
- టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా)
- ఉల్లిపాయ – 1 (తరిగినది)
- పచ్చిమిర్చి – 1 (చీరినది)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
- పసుపు – ¼ టీస్పూన్
- కారం – 1 టీస్పూన్
- ధనియాల పొడి – 1 టీస్పూన్
- గరం మసాలా – ½ టీస్పూన్
- ఉప్పు – తగినంత
- నీరు – ½ కప్పు
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – అలంకరణకు
తయారీ విధానం:
- కాలిఫ్లవర్ ముక్కలను ఉప్పు కలిపిన వేడి నీటిలో 3–4 నిమిషాలు మరిగించి వడకట్టాలి.
- పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు కలపాలి.
- టమాటాలు వేసి మెత్తబడే వరకు వండాలి.
- పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కాలిఫ్లవర్ ముక్కలు వేసి, ½ కప్పు నీరు పోసి మూత పెట్టి 8–10 నిమిషాలు మరిగించాలి.
- చివరగా గరం మసాలా చల్లి కొత్తిమీరతో అలంకరించాలి. వేడి వేడి గా వడ్డించండి.
ఆరోగ్య ప్రయోజనాలు :
- ఫైబర్ పుష్కలంగా ఉంటుంది – కాలిఫ్లవర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
- కెలరీస్ తక్కువ – బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక.
- విటమిన్లు అధికంగా ఉంటాయి – కాలిఫ్లవర్‌లో విటమిన్ C, K, B6 ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
- యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి – టమాటాల్లో ఉండే లైకోపిన్ గుండె ఆరోగ్యానికి మంచిది, శరీరంలో వాపులను తగ్గిస్తుంది.
- చర్మం మరియు కళ్ల ఆరోగ్యానికి – టమాటాలోని పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కంటి చూపు మెరుగవుతుంది.