Chakkara Pongali is a traditional sweet dish from South India, often prepared during festivals like Sankranti, Navratri,Varalakshmi Vratham etc. Made with rice, moong dal, jaggery, and ghee, it has a divine taste and soft texture. The combination of natural ingredients makes it not just delicious but also nourishing. It is commonly offered as naivedyam to deities and enjoyed with devotion and joy during festive occasions.
Chakkara Pongali Recipe
Ingredients:
- Rice – ½ cup
- Moong dal – 2 tbsp
- Jaggery – ¾ cup (adjust to taste)
- Ghee – 2–3 tbsp
- Cashews – 10
- Raisins – 10
- Cardamom powder – ¼ tsp
- Water – 2 ½ cups
- Milk (optional) – ½ cup
Preparation:
- Dry roast moong dal till a nice aroma comes.
- Wash rice and roasted dal together.
- Pressure cook rice and dal with 2½ cups of water (and milk if using) for 3–4 whistles.
- Meanwhile, melt jaggery in ¼ cup water and strain impurities.
- Mash the cooked rice-dal mixture.
- Add jaggery syrup to it and cook on low flame for 5–7 mins till it thickens.
- Add cardamom powder.
- Fry cashews and raisins in ghee; add to pongal.
- Drizzle remaining ghee and mix well.
Serve hot with ghee on top.
Health Benefits:
- Jaggery is rich in iron and essential minerals, which help improve hemoglobin levels and aid digestion.
- Moong dal is a good source of plant-based protein and dietary fiber, which supports muscle health and improves gut function.
- Ghee contains healthy fats that promote energy, support brain and joint health, and enhance nutrient absorption.
- Cashews and raisins provide natural energy, good fats, and antioxidants that boost immunity.
- Cardamom aids digestion and freshens breath with its natural detoxifying properties.
చక్కర పొంగలి అనేది దక్షిణ భారతీయ సంప్రదాయ మిఠాయి, ముఖ్యంగా సంక్రాంతి, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులలో తయారు చేస్తారు. బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యితో తయారవుతూ స్వాదిష్టంగా ఉంటుంది. ఇది దేవునికి నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తితో తినే పవిత్రమైన స్వీట్. శరీరానికి శక్తిని ఇచ్చే సహజ పదార్థాలతో ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా.
చక్కర పొంగలి తయారీ విధానం:
అవసరమైన పదార్థాలు:
- బియ్యం – ½ కప్పు
- పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్లు
- బెల్లం – ¾ కప్పు
- నెయ్యి – 2–3 టేబుల్ స్పూన్లు
- జీడిపప్పు – 10
- కిస్మిస్ – 10
- ఏలకుల పొడి – ¼ టీస్పూన్
- నీళ్లు – 2½ కప్పులు
- పాలు (ఐచ్ఛికం) – ½ కప్పు
తయారీ విధానం:
- పెసరపప్పును కొంచెం వేయించి ఉంచండి.
- బియ్యం, పప్పును కలిపి కడిగి ప్రెషర్ కుక్కర్‌లో నీటితో ఉడికించండి.
- బెల్లాన్ని నీటిలో కరిగించి,వడకట్టండి.
- ఉడికిన బియ్యం పప్పును మెత్తగా చేసి బెల్లం పానీయం కలపండి.
- 5–7 నిమిషాలు మరిగించండి.
- ఏలకుల పొడి వేసి కలపండి.
- నెయ్యిలో జీడిపప్పు,కిస్మిస్ను వేయించి పోంగల్లో కలపండి.
- చివరగా కొంచెం నెయ్యి వేయండి.
వేడిగా నెయ్యి తో పాటు సర్వ్ చేయండి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- బెల్లం లో ఐరన్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
- పెసరపప్పు శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- నెయ్యి శరీరానికి మంచి కొవ్వుల్ని అందిస్తుంది. శక్తి, బలాన్ని పెంచుతుంది.
- జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తిని, మంచి కొవ్వులను అందిస్తాయి.
- ఏలకుల పొడి జీర్ణశక్తిని మెరుగుపరచి, మౌత్‌ఫ్రెష్‌నెస్ ఇస్తుంది.