Gongura Pappu (Puntikura Pappu) is a traditional Andhra-style dal made with sorrel leaves (gongura) and toor dal. Its signature tangy flavor, combined with mild spices, makes it a popular everyday dish in Telugu households. Served hot with rice and ghee, it brings both taste and nutrition to the plate.
Ingredients
- Toor dal – ½ cup
- Gongura leaves (sorrel leaves) – 1 cup (washed and chopped)
- Onion – 1 (chopped)
- Green chillies – 2 (slit)
- Turmeric powder – ¼ tsp
- Red chilli powder – ½ tsp
- Salt – as needed
- Water – as needed
For Tempering
- Oil – 1 tbsp
- Mustard seeds – ½ tsp
- Cumin seeds – ½ tsp
- Garlic – 3–4 cloves (crushed)
- Dry red chillies – 2
- Curry leaves – few
Preparation Method
- Pressure cook toor dal with turmeric and water until soft.
- In a separate pan, boil chopped gongura leaves with a little water until they turn soft.
- Heat oil and prepare tempering with mustard seeds, cumin seeds, garlic, red chillies, and curry leaves.
- Add onions and green chillies. Sauté till onions turn soft.
- Add red chilli powder, salt, and boiled gongura. Cook for 3–5 minutes.
- Add cooked dal and mix well. Adjust consistency with water.
- Simmer for 5–10 minutes. Serve hot with steamed rice and ghee.
Health Benefits
- Rich in Iron: Helps prevent anemia and increases hemoglobin levels.
- High in Vitamin C: Boosts immunity and supports skin health.
- Antioxidants: Fights oxidative stress and supports overall health.
- Good Source of Fiber: Aids digestion and prevents constipation.
- Natural Detoxifier: Gongura helps cleanse the system and supports liver health.
- Protein from Dal: Builds and repairs tissues and improves strength.
Tips
- Balance the sourness – Gongura leaves are naturally tangy. Adjust the quantity of leaves depending on how sour you want the dal.
- Use ghee for tempering – For richer taste, prepare the tempering (popu) in ghee instead of oil.
- Consistency matters – The dal should not be too watery; keep it slightly thick so it coats the rice well.
- Soak dal for quicker cooking – Soak toor dal for 20 minutes before cooking to reduce whistle time.
- Choose red-stemmed gongura – They are more sour than green-stemmed ones and give authentic Andhra flavor.
Variations
- Spicy Version – Add extra green chillies and a little more red chilli powder for a fiery Andhra-style taste.
- Onion & Garlic-Free Version – Skip onion and garlic for a simple satvik-style dal.
- With Moong Dal – Replace toor dal with moong dal for a lighter, easily digestible variation.
- With Tomato – Add 1–2 chopped tomatoes while pressure cooking for a tangy-sweet balance.
గోంగూర పప్పు (పుంటికూర పప్పు ) అనేది ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధమైన పుల్ల రుచితో కూడిన పప్పు వంటకం. గోంగూరతో కందిపప్పు కలిపి తయారుచేసే ఈ వంటకం రోజువారీ భోజనంలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. వేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతమైన రుచి మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
గోంగూర పప్పు తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు
- కందిపప్పు – ½ కప్పు
- గోంగూర – 1 కప్పు (సన్నగా కట్ చేయాలి)
- ఉల్లిపాయ – 1 (సన్నగా కట్ చేయాలి)
- పచ్చిమిరపకాయలు – 2 (నులిపి వేయాలి)
- పసుపు – ¼ టీస్పూన్
- కారం – ½ టీస్పూన్
- ఉప్పు – తగినంత
- నీరు – తగినంత
తాలింపు కోసం
- నూనె – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – ½ టీస్పూన్
- జీలకర్ర – ½ టీస్పూన్
- వెల్లుల్లి – 3–4 పళ్లు (ముద్ద చేయాలి)
- ఎండు మిరపకాయలు – 2
- కరివేపాకు – కొద్దిగా
తయారీ విధానం
- కందిపప్పును పసుపుతో పాటు నీటిలో ఉడికించాలి.
- వేరే పాత్రలో గోంగూర తరుగును కొద్దిగా నీటితో మగ్గించాలి.
- పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు పదార్థాలు వేసి వేయించాలి.
- ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి.
- కారం, ఉప్పు, ఉడికిన గోంగూర వేసి కలపాలి.
- తరువాత ఉడికిన పప్పు వేసి నీరు సర్చి 5–10 నిమిషాలు మరిగించాలి.
- వేడి అన్నంలోకి తాలింపు వేసిన గోంగూర పప్పు సర్వ్ చేయండి.
ఆరోగ్య ప్రయోజనాలు
- ఐరన్ పుష్కలంగా ఉంటుంది: రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
- విటమిన్ C అధికంగా ఉంటుంది: రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- యాంటీఆక్సిడెంట్లు: శరీరంలో హానికరమైన టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి.
- ఫైబర్ అధికంగా ఉంటుంది: జీర్ణక్రియ మెరుగవుతుంది, కబ్జం సమస్య తగ్గుతుంది.
- డిటాక్స్‌గా పనిచేస్తుంది: కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- ప్రోటీన్ (పప్పు ద్వారా): శరీర కండరాలను బలోపేతం చేస్తుంది.
చిట్కాలు
- పులుపు నియంత్రణ – గోంగూర ఆకులు సహజంగా పుల్లగా ఉంటాయి. కావలసినంత పులుపు కోసం ఆకుల పరిమాణాన్ని సర్దుబాటు చేయండి.
- నెయ్యితో పోపు – రుచిని మరింతగా పెంచాలంటే నూనె బదులు నెయ్యితో పోపు వేయండి.
- పప్పు చిక్కదనం – పప్పు చాలా నీరుగా కాకుండా, కొంచెం గట్టిగా ఉండాలి. అన్నంలో కలిపితే బాగా పట్టాలి.
- పప్పు నానబెట్టడం – కందిపప్పును 20 నిమిషాలు ముందే నానబెట్టితే త్వరగా మెత్తబడుతుంది.
- ఎరుపు గోంగూర వాడండి – ఎరుపు కాండం గల గోంగూర ఆకులు ఎక్కువ పుల్లగా ఉంటాయి. ఇవే ఆంధ్ర రుచి ఇస్తాయి.
రకాలు
- కారం ఎక్కువగా – ఎక్కువ పచ్చిమిర్చి, కారం వేసి ఆంధ్ర స్టైల్‌గా మసాలా రుచి తెచ్చుకోవచ్చు.
- ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా – ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండా సాత్విక శైలిలో తయారు చేయవచ్చు.
- పెసర పప్పుతో – కందిపప్పు బదులు పెసర పప్పుతో చేసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది.
- టమాటాతో కలిపి – కుక్కింగ్ సమయంలో 1–2 టమోటాలు వేసి రుచిలో పుల్ల-తీపి బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చు.