Biscuits are a popular baked snack enjoyed around the world. They are typically made using flour, fat (like ghee or oil), a raising agent like baking powder, and optional ingredients such as sugar or spices. Biscuits can be sweet or savory and are commonly served with tea or milk. Homemade biscuits are healthier alternatives to store-bought ones, as they contain no preservatives and can be customized for children and adults alike.
Ingredients:
- All-purpose flour (maida) – 1½ cups
- Powdered sugar – ½ cup (adjust to taste)
- Baking powder – ½ tsp
- Salt – a pinch
- Cardamom powder – ¼ tsp (optional, for flavor)
- Ghee or neutral oil – ⅓ cup (not hot)
- Milk – 2–4 tbsp (as needed to form dough)
Instructions:
- Preheat oven to 170°C (340°F). Line a baking tray with parchment paper.
- In a mixing bowl, sift together flour, baking powder, salt, and cardamom powder.
- Add powdered sugar and mix well.
- Pour in ghee or oil and gently mix with your fingers until it becomes crumbly.
- Add milk 1 tbsp at a time and gently knead into a soft dough (don’t overwork).
- Pinch off small balls or shape the dough into rounds or squares.
- Place on the baking tray. Press lightly with a fork if desired.
- Bake for 15–18 minutes or until light golden at the edges.
- Cool completely before storing in an airtight box.
Variations:
- Savory Version: Skip sugar and add cumin seeds, crushed black pepper, and a pinch of ajwain.
- Coconut Flavor: Add 2 tbsp desiccated coconut to the dough.
- Chocolate Version: Add 1 tbsp cocoa powder to flour and reduce sugar slightly.
Tips:
- Ghee gives a richer flavor than oil.
- Do not overbake – biscuits continue to firm up after cooling.
- You can use whole wheat flour for a healthier version (will be denser).
Health Benefits of Homemade Biscuits
- No preservatives or additives
– Homemade biscuits are free from harmful chemicals, synthetic flavors, and preservatives used in store-bought ones. - Easily digestible
– Using simple ingredients like maida or whole wheat and mild natural flavorings like cardamom makes them easier on the stomach. - Controlled sugar and salt
– You control how much sugar or salt goes in, making it suitable for kids, elderly, and people with dietary restrictions. - Customizable with healthy add-ons
– You can add flax seeds, sesame, oats, or nuts for added nutrition. - Better than store-bought junk snacks
– Perfect alternative to chips or packaged cookies which are full of trans fats and artificial flavors.
బిస్కెట్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బేక్ చేసిన అల్పాహార పదార్థాలు. ఇవి సాధారణంగా పిండి (మైదా లేదా గోధుమ పిండి), కొవ్వు పదార్థం (నెయ్యి లేదా ఆయిల్), బేకింగ్ పౌడర్ వంటి పదార్థం మరియు అవసరమైనట్లు చక్కెర లేదా ఉప్పుతో తయారవుతాయి. బిస్కెట్లు తీపిగా లేదా ఉప్పుగా ఉండవచ్చు. వీటిని సాధారణంగా టీ లేదా పాలతో పాటు తీసుకుంటారు. ఇంట్లో తయారు చేసిన బిస్కెట్లు ప్రిజర్వేటివ్‌లు లేకుండా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పిల్లల రుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
- మైదా – 1½ కప్పు
- పొడి చెక్కెర – ½ కప్పు (రుచికి తగ్గించవచ్చు)
- బేకింగ్ పౌడర్ – ½ చెంచా
- ఉప్పు – చిటికెడు
- యాలకుల పొడి – ¼ చెంచా (ఐచ్ఛికం)
- నెయ్యి లేదా ఆయిల్ – ⅓ కప్పు
- పాలు – 2–4 టేబుల్ స్పూన్లు (తినదగిన మృదువైన ముద్దకోసం)
తయారీ విధానం:
- ఓవెన్‌ను 170°C (340°F)కి ప్రీహీట్ చేయండి. ఓవెన్ ట్రేపై పెర్చ్‌మెంట్ షీట్ వేయండి లేక నెయ్యితో మెరుగు పెట్టండి.
- ఒక గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, యాలకుల పొడి వేసి బాగా కలపండి.
- చెక్కెరను కూడా జోడించి కలపండి.
- ఇప్పుడు నెయ్యి లేదా ఆయిల్ వేసి చేతులతో పిసుకుతూ, పొడి ముద్దలా తయారు చేయండి.
- అవసరమైతే కొద్దిగా పాలు వేసుకుంటూ మృదువైన ముద్దలా కలిపి పట్టుకోండి.
(మృదువుగా ఉండాలి.) - చిన్న చిన్న బాల్స్ తీసుకొని బిస్కెట్ ఆకారంలో చేయండి లేదా రౌండ్‌గా చేత్తో నొక్కండి.
- ట్రేపై అమర్చి, ఫోర్క్‌తో మెల్లగా ఒత్తండి (అందంగా కనిపించడానికి).
- 15–18 నిమిషాలు లేదా అంచులు స్వల్పంగా గోధుమరంగులోకి మారే వరకు బేక్ చేయండి.
- పూర్తిగా చల్లబడిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేయండి.
రకాలు:
- సాల్టీ బిస్కెట్ కావాలంటే – చెక్కెర తొలగించి,ఉప్పు,వాము, జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవచ్చు.
- కొబ్బరి టచ్ – పొడి కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు కలిపి చేసుకోవచ్చు.
- చాక్లెట్ రుచి – 1 టేబుల్ స్పూన్ కోకో పొడి కలిపి, చెక్కెర కాస్త తగ్గించాలి.
చిట్కాలు:
- నెయ్యితో వాసన బాగా వస్తుంది, ఆయిల్ తో బిస్కెట్లు తేలికగా ఉంటాయి.
- మిక్స్ చేసే సమయంలో ఎక్కువగా ముద్ద చేయకండి.
- చల్లబడిన తర్వాతే డబ్బాలో పెట్టండి, లేకపోతే మృదువుగా మారిపోతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
- కెమికల్స్ లేవు
– ఇంట్లో తయారు చేసిన బిస్కెట్లు ప్రిజర్వేటివ్‌లు, కలరింగ్ ఏజెంట్లు, మాస్ప్రోడక్ట్ చేసిన ఫ్లేవర్స్ లేకుండా సహజంగా ఉంటాయి. - సులభంగా జీర్ణమవుతాయి
– సాదా పదార్థాలతో, తేలికపాటి తీపి రుచితో ఉండటం వలన చిన్న పిల్లలు, వృద్ధులు కూడా తినవచ్చు. - తీపి/ఉప్పు నియంత్రణలో ఉంటుంది
– అవసరానికి తగినంత మాత్రమే చెక్కెర లేదా ఉప్పు వేసుకోవచ్చు. డయాబెటిక్ లేదా BP ఉన్నవారికి తగ్గట్టు మార్చవచ్చు. - ఆరోగ్యకరమైన పదార్థాలు కలపవచ్చు
– జీలకర్ర,వాము, ఓట్స్, ఎండు నట్‌లు, సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటివి కలిపి మరింత ఆరోగ్యంగా తయారుచేయవచ్చు. - ప్యాకెట్ స్నాక్స్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం
– బయట దొరికే చిప్స్, కుకీస్ కన్నా మంచి ఎంపిక.