Pachi Chalimidi is a traditional Andhra sweet made especially during festivals, vratham (fasting), and pujas. It’s a no-cook, naturally sweetened dish made using soaked rice, jaggery or honey, and ghee. The word “Pachi” means raw (uncooked) and “Chalimidi” means a soft, sweet rice mixture.
Ingredients:
- Raw rice – 1 cup
- Grated jaggery or honey – ½ cup (adjust to taste)
- Fresh ghee – 2 tablespoons
- Cardamom powder – ¼ teaspoon
- Grated coconut – 2 tablespoons
- Cashews and raisins – optional (fried in ghee)
Preparation:
- Soak and Powder the Rice:
- Wash raw rice thoroughly and soak it in water for 4–5 hours.
- Drain the water completely and dry the rice slightly using a cloth.
- Powder the rice in a mixer into a slightly coarse, moist rice powder. Do not make it into a paste.
- Sieve the Rice Powder:
- Sieve the ground rice powder using a fine mesh sieve to get soft, uniform chalimidi flour.
- Discard or reuse the coarse particles as desired.
- Mix the Chalimidi:
- In a bowl, combine the moist rice flour with jaggery or honey.
- Add melted ghee, grated coconut, and cardamom powder.
- Mix well to form a soft dough-like sweet mixture.
- Optional Garnishing:
- Fry cashews and raisins in a little ghee and add to the mixture.
- Serve fresh or offer as prasadam.
Notes:
- Make sure rice flour is freshly made and moist – dry flour won’t give the correct texture.
- You can adjust the amount of sweetness by changing the jaggery/honey quantity.
- This sweet is rich, soft, and nourishing – often given during fasting food.
Health Benefits:
- Provides instant energy from jaggery and rice
- Good source of iron from jaggery
- Ghee improves digestion and nourishes the body
- Ideal for fasting and festivals
పచ్చి చలిమిడి తయారీ విధానం:
పచ్చి చలిమిడి అనేది ఆంధ్రప్రదేశ్‌లో పూజల సమయంలో ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయ తీపి వంటకం. ఇది వండకుండా తయారవుతుంది కాబట్టి “పచ్చి” అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, శ్రీరామనవమి,నోములు వంటి సందర్భాలలో నైవేద్యంగా చేస్తారు.
కావలసిన పదార్థాలు:
- బియ్యం – 1 కప్పు
- బెల్లం లేదా తేనె – ½ కప్పు (తీపి రుచికి తగ్గట్టు)
- తాజా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
- ఏలకుల పొడి – ¼ టీస్పూను
- కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు (ఐచ్చికం)
- జీడి పప్పు, ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూను (వెయ్యించి, ఐచ్చికం)
తయారీ విధానం:
- బియ్యం నానబెట్టి పొడిగా తయారుచేయడం:
- బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4–5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
- నీటిని పూర్తిగా తీసేసి, బియ్యాన్ని కొన్ని నిమిషాలు గుడ్డపై ఆరబెట్టి ఉంచాలి (పూర్తిగా ఎండబెట్టవద్దు).
- తర్వాత మిక్సీలో పొడి చేయాలి. పేస్ట్ చేయకూడదు.
- బియ్యం పిండిని జల్లించడం:
- ఈ పిండిని జల్లెడతో జల్లించి మెత్తగా ఉన్న పిండి తీసుకోవాలి.
- చలిమిడి కలపడం:
- తడి బియ్యం పిండిలో బెల్లం లేదా తేనె కలపాలి.
- తర్వాత నెయ్యి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి.
- అవసరమైతే జీడి పప్పు, ద్రాక్ష వేయించి కలపవచ్చు.
గమనికలు:
- బియ్యం పిండి తప్పనిసరిగా తాజాగా మరియు తడిగా ఉండాలి – పొడి పిండి ఉపయోగిస్తే చలిమిడి సరైన విధంగా రాదు.
- బెల్లం లేదా తేనె పరిమాణాన్ని మీ తీపి అభిరుచికి అనుగుణంగా తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.
- ఈ తీపి వంటకం మృదువుగా, పోషకంగా ఉండే స్వీట్ – ఉపవాస సమయంలో ఆహారంగా తీసుకోవడం ఆనవాయితి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- బెల్లం శరీరానికి శక్తినిస్తుంది
- నెయ్యి శరీరానికి పోషణ ఇస్తుంది
- వండకపోవడం వలన పోషకాలు పూర్తిగా ఉండే స్వీట్
- ఉపవాస సమయంలో శక్తినిచ్చే ఆహారం