Recipe in Telugu

తెలుగు వంటలు

Easy Veg & Non-Veg Cooking Tips Authentic Telugu Recipes

Pachi Chalimidi, Vada Pappu, Paanakam Recipes

Last updated on 28th July, 2025 by

Discover traditional South Indian naivedyam recipes like Pachi Chalimidi, Vada Pappu, and Paanakam made during festivals and vratas like Sri Rama Navami, Varalakshmi Vratam, and Shravanamasam.

Pachi Chalimidi, Vada Pappu, and Paanakam are sacred Andhra Naivedyam dishes traditionally prepared during Sri Rama Navami, Varalakshmi Vratam, Sravana Masam, Navratri, and various vratas. These no-cook recipes are simple, sattvic, and full of symbolic meaning — made with jaggery, soaked moong dal, and raw rice flour. Light, cooling, and nourishing, they promote wellness during fasting and serve as pure offerings in devotional practices.

Pachi Chalimidi Recipe:

Pachi Chalimidi is a traditional Andhra sweet made especially during festivals, vratham (fasting), and pujas. It’s a no-cook, naturally sweetened dish made using soaked rice, jaggery or honey, and ghee. The word “Pachi” means raw (uncooked) and “Chalimidi” means a soft, sweet rice mixture.

Ingredients:

  • Raw rice – 1 cup
  • Grated jaggery or honey – ½ cup (adjust to taste)
  • Fresh ghee – 2 tablespoons
  • Cardamom powder – ¼ teaspoon
  • Grated  coconut – 2 tablespoons
  • Cashews and raisins – optional (fried in ghee)

Preparation:

  1. Soak and Powder the Rice:
    • Wash raw rice thoroughly and soak it in water for 4–5 hours.
    • Drain the water completely and dry the rice slightly using a cloth.
    • Powder the rice in a mixer into a slightly coarse, moist rice powder. Do not make it into a paste.
  2. Sieve the Rice Powder:
    • Sieve the ground rice powder using a fine mesh sieve to get soft, uniform chalimidi flour.
    • Discard or reuse the coarse particles as desired.
  3. Mix the Chalimidi:
    • In a bowl, combine the moist rice flour with jaggery or honey.
    • Add melted ghee, grated coconut, and cardamom powder.
    • Mix well to form a soft dough-like sweet mixture.
  4. Optional Garnishing:
    • Fry cashews and raisins in a little ghee and add to the mixture.
    • Serve fresh or offer as prasadam.

Notes:

  • Make sure rice flour is freshly made and moist – dry flour won’t give the correct texture.
  • You can adjust the amount of sweetness by changing the jaggery/honey quantity.
  • This sweet is rich, soft, and nourishing – often given during fasting food.

Health Benefits:

  • Provides instant energy from jaggery and rice
  • Good source of iron from jaggery
  • Ghee improves digestion and nourishes the body
  • Ideal for fasting and festivals

పచ్చి చలిమిడి తయారీ విధానం:

పచ్చి చలిమిడి అనేది ఆంధ్రప్రదేశ్‌లో పూజల సమయంలో ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయ తీపి వంటకం. ఇది వండకుండా తయారవుతుంది కాబట్టి “పచ్చి” అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా  శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, శ్రీరామనవమి,నోములు వంటి సందర్భాలలో నైవేద్యంగా చేస్తారు.

కావలసిన పదార్థాలు:

  • బియ్యం – 1 కప్పు
  • బెల్లం లేదా తేనె – ½ కప్పు (తీపి రుచికి తగ్గట్టు)
  • తాజా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • ఏలకుల పొడి – ¼ టీస్పూను
  • కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు (ఐచ్చికం)
  • జీడి పప్పు, ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూను (వెయ్యించి, ఐచ్చికం)

తయారీ విధానం:

  1. బియ్యం నానబెట్టి పొడిగా తయారుచేయడం:
    • బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4–5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
    • నీటిని పూర్తిగా తీసేసి, బియ్యాన్ని కొన్ని నిమిషాలు  గుడ్డపై ఆరబెట్టి ఉంచాలి (పూర్తిగా ఎండబెట్టవద్దు).
    • తర్వాత మిక్సీలో పొడి చేయాలి. పేస్ట్ చేయకూడదు.
  2. బియ్యం పిండిని జల్లించడం:
    • ఈ పిండిని జల్లెడతో జల్లించి మెత్తగా ఉన్న పిండి తీసుకోవాలి.
  3. చలిమిడి కలపడం:
    • తడి బియ్యం పిండిలో బెల్లం లేదా తేనె కలపాలి.
    • తర్వాత నెయ్యి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి.
    • అవసరమైతే జీడి పప్పు, ద్రాక్ష వేయించి కలపవచ్చు.

గమనికలు:

  • బియ్యం పిండి తప్పనిసరిగా తాజాగా మరియు తడిగా ఉండాలి – పొడి పిండి ఉపయోగిస్తే చలివిడి సరైన విధంగా రాదు.
  • బెల్లం లేదా తేనె పరిమాణాన్ని మీ తీపి అభిరుచికి అనుగుణంగా తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.
  • ఈ తీపి వంటకం మృదువుగా, పోషకంగా ఉండే స్వీట్ – ఉపవాస సమయంలో  ఆహారంగా తీసుకోవడం ఆనవాయితి.

ఆరోగ్య ప్రయోజనాలు:

  • బెల్లం శరీరానికి శక్తినిస్తుంది
  • నెయ్యి శరీరానికి పోషణ ఇస్తుంది
  • వండకపోవడం వలన పోషకాలు పూర్తిగా ఉండే స్వీట్
  • ఉపవాస సమయంలో శక్తినిచ్చే ఆహారం

Vada Pappu Recipe

Vada Pappu is a traditional Andhra dish made with just soaked moong dal. It is commonly offered as Naivedyam (offering) during auspicious days like Sri Rama Navami and other pujas.

Ingredients:

  • Yellow moong dal– ½ cup

Preparation Method:

  • Soak the Dal:
    • Wash moong dal thoroughly.
    • Soak in clean water for 30 minutes to 1 hour.
    • Drain water completely and set aside.
  • Serve:
    • Offer plain soaked moong dal as Naivedyam.

Health Benefits:

  • High in protein and easy to digest
  • Naturally cooling for the body
  • No oil, spices, or cooking — pure satvik food
  • Ideal for fasting and religious offerings

వడపప్పు తయారీ విధానం:

వడపప్పు (వడ పప్పు) అనేది ఉపవాసం మరియు పూజల సందర్భాలలో ఇచ్చే ఒక శుద్ధమైన మరియు సులభమైన ప్రసాదం. ఇది ఉగాది, శ్రీరామనవమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మాసం, మరియు నవరాత్రులు వంటి పండుగలలో నైవేద్యంగా ఇవ్వబడుతుంది.

కావలసిన పదార్థాలు:

  • పెసర పప్పు
  • నీరు – నానబెట్టడానికి

తయారీ విధానం:

  1. పప్పును శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.
  2. నీటిని పూర్తిగా తీసేసి, నానబెట్టిన పప్పును నైవేద్యంగా వాడాలి.

ఆరోగ్య ప్రయోజనాలు:

  • ప్రొటీన్ అధికంగా ఉంటుంది
  • తేలికగా జీర్ణమవుతుంది
  • వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది
  • పూజల సమయంలో శుద్ధమైన ఆహారంగా వాడతారు

 


 

Paanakam Recipe

Paanakam is a refreshing, sacred drink made with jaggery, water, and spices. It is especially prepared during Sri Rama Navami and other festivals as Naivedyam (offering) and as a natural body coolant.

Ingredients:

  • Jaggery (grated or powdered) – ½ cup
  • Water – 2 to 2½ cups
  • Dry ginger powder (sonth / sunti) – ½ tsp
  • Black pepper powder – ¼ tsp
  • Cardamom powder – ¼ tsp
  • Tulsi leaves – a few (optional)

Preparation Method:

  1. Dissolve jaggery in water. Stir well until fully melted.
  2. Add dry ginger powder, pepper powder, and cardamom powder.
  3. Mix thoroughly. Add tulsi leaves if using.
  4. Let it rest for 5–10 minutes for flavors to infuse.
  5. Serve at room temperature or slightly chilled.

Health Benefits :

  • Jaggery provides energy and boosts immunity
  • Dry ginger aids digestion and reduces body heat
  • Black pepper helps fight infections
  • A natural summer drink with Ayurvedic value

 


పానకం తయారీ విధానం

పానకం అనేది బెల్లం, మిరియాల పొడి, సొంటి మరియు తులసి ఆకులతో తయారయ్యే పవిత్రమైన పానీయం. ఇది ముఖ్యంగా శ్రీరామనవమి, ఉగాది, వ్రతాల సమయంలో నైవేద్యంగా ఉపయోగిస్తారు.

కావలసిన పదార్థాలు:

  • బెల్లం – ½ కప్పు (తురిమినది లేదా పొడిగా చేసినది)
  • నీరు – 2½ కప్పులు
  • సొంటిపొడి  – ½ టీస్పూన్
  • మిరియాల పొడి – ¼ టీస్పూన్
  • ఏలకుల పొడి – ¼ టీస్పూన్
  • తులసి ఆకులు – కొన్ని (ఐచ్చికం)

తయారీ విధానం:

  1. నీటిలో బెల్లాన్ని వేసి బాగా కలిపి పూర్తిగా కరిగేలా చేయాలి.
  2. అందులో సొంటిపొడి, మిరియాల పొడి, ఏలకుల పొడి వేసి కలపాలి.
  3. తులసి ఆకులు వేసి కొద్దిసేపు నాననివ్వాలి.
  4. గ్లాసులకు పోసి పూజకు నైవేద్యంగా ఇవ్వవచ్చు .

ఆరోగ్య ప్రయోజనాలు:

  • బెల్లం శక్తినిస్తుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది
  • మిరియాలు, సొంటిపొడి జీర్ణక్రియకు సహాయపడతాయి
  • తులసి యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది
  • వేసవిలో దాహాన్ని తీరుస్తుంది