Pulihora, also known as tamarind rice, is a traditional South Indian dish made by mixing cooked rice with a tangy tamarind extract, tempered with spices like mustard seeds, green and red chilies, curry leaves, ginger, and peanuts. It is widely prepared during festivals, special occasions, and as a simple comfort meal. The unique blend of sour, spicy, and aromatic flavors makes pulihora a beloved dish across Andhra Pradesh, Telangana, Tamil Nadu, and Karnataka.
Pulihora (Tamarind Rice) Recipe
Ingredients:
- Cooked rice – 1 cup
- Tamarind – lemon-sized (soaked in water)
- Oil – 2 tbsp
- Mustard seeds – 1 tsp
- Cumin seeds – 1 tsp
- Dry red chilies – 2 (broken)
- Green chilies – 2–3 (slit)
- Ginger – 1 inch piece (finely chopped)
- Chana dal – 1 tbsp
- Peanuts or cashews – 1–2 tbsp
- Curry leaves – few
- Turmeric powder – 1/4 tsp
- Asafoetida (hing) – a pinch
- Salt – to taste
Tamarind Mix Preparation:
- Soak tamarind in water for 15–20 minutes.
- Extract thick pulp and strain out seeds and fiber.
- In a small pan, heat 1 tbsp oil.
- Add turmeric and salt. Pour in the tamarind pulp.
- Boil for 5 minutes until it thickens slightly. Keep aside.
Main Preparation (Tempering and Mixing):
- Heat the remaining oil in a pan.
- Add mustard seeds and cumin seeds. Let them splutter.
- Add peanuts,chana dal and fry until light golden.
- Add red chilies, green chilies, ginger and curry leaves. Fry well.
- Add hing and stir.
- Pour the tamarind mix into this tempering. Cook for 1 minute.
- Add the cooked rice and mix gently until coated evenly.
- Simmer on low flame for 2–3 minutes. Switch off and serve.
Health Benefits:
- Tamarind aids digestion and is rich in antioxidants.
- Chana dal and peanuts add protein and texture.
- Ginger helps reduce bloating and improves gut health.
- Curry leaves and turmeric provide anti-inflammatory properties.
- A light and satisfying dish suitable for lunch or travel.
పులిహోర అనేది చింతపండు రసం మరియు ప్రత్యేక తాలింపు మసాలాలతో చేసిన సాంప్రదాయ దక్షిణ భారతీయ అన్నం వంటకం. ఇది పుల్లగా, కారంగా, సుగంధంగా ఉండి పండుగలకూ, ప్రత్యేక సందర్భాల్లోనూ తరచుగా చేస్తారు. ఈ వంటకం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందింది.
పులిహోర తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
- వండిన అన్నం – 1 కప్పు
- చింతపండు – నిమ్మకాయ పరిమాణం (నీటిలో నానబెట్టినది)
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – 1 టీ స్పూన్
- జీలకర్ర – 1 టీ స్పూన్
- ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)
- పచ్చిమిర్చి – 2–3 (పొడవుగా కోయాలి)
- అల్లం – 1 అంగుళం ముక్క (సన్నగా తరిగినది)
- సెనగపప్పు – 1 టేబుల్ స్పూన్
- పల్లీలు / జీడిపప్పు – 1–2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు – కొన్ని రెమ్మలు
- పసుపు – 1/4 టీ స్పూన్
- ఇంగువ– చిటికెడు
- ఉప్పు – తగినంత
చింతపండు మిశ్రమం తయారీ:
- చింతపండును 15–20 నిమిషాలు నీటిలో నానబెట్టి, గింజలు, తుక్కులు తొలగించండి.
- ఒక చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి.
- అందులో పసుపు, ఉప్పు వేసి కలపండి.
- గుజ్జు పోసి 5 నిమిషాలు మరిగించి చిక్కగా తయారు చేయండి.పక్కకు పెట్టండి.
తాలింపు & కలపడం:
- మిగిలిన నూనెను పాన్‌లో వేడి చేయండి.
- అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
- తరువాత పల్లీలు,సెనగపప్పు వేసి స్వర్ణ రంగు వచ్చే వరకు వేయించండి.
- ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించండి.
- చివరగా ఇంగువ వేసి కలపండి.
- ఇప్పుడు చింతపండు మిశ్రమం పోసి ఒక నిమిషం మరిగించండి.
- అన్నం వేసి మెల్లగా కలిపి, అన్నం మిశ్రమంతో బాగా పట్టేలా చూడండి.
- 2–3 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి ఆపేయండి.
ఆరోగ్య ప్రయోజనాలు :
- చింతపండు జీర్ణక్రియకు సహకరిస్తుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది.
- సెనగపప్పు, పల్లీలు ప్రోటీన్‌ను అందిస్తాయి.
- అల్లం అజీర్ణం మరియు వాయువు సమస్యలను తగ్గిస్తుంది.
- కరివేపాకు, పసుపు శరీరానికి శక్తినిస్తాయి మరియు శోథనను తగ్గిస్తాయి.
- తేలికగా ఉండే ఈ వంటకం లంచ్‌కు, ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.