Sunnundalu (Andhra-style Urad Dal Laddu) is a traditional, protein-rich Andhra sweet made by roasting urad dal and rice, grinding them into a fine powder, and mixing with jaggery and ghee. This wholesome delicacy is prepared during festivals like Sankranti, Diwali, as well as for special occasions. Known for its rich aroma, nutty taste, and high nutritional value, Sunnundalu are especially recommended for children.
Ingredients
- Whole urad dal (minapa pappu) – 1 cup
- Raw rice – ¼ cup
- Jaggery (bellam) – 1 cup (powdered)
- Ghee – ½ cup (melted, adjust as needed)
- Cardamom powder – ½ tsp
Preparation
- Roast Rice – Heat a pan and dry roast the rice on low flame until light golden and aromatic. Remove and keep aside.
- Roast Urad Dal – In the same pan, roast urad dal on low flame until golden brown and fragrant.
- Cool & Grind – Let both cool completely, then grind together into a fine powder.
- Mix Sweetener – Add powdered jaggery and cardamom powder to the mixture and combine well.
- Add Ghee – Gradually pour melted ghee and mix until the mixture holds shape.
- Shape Laddus – Roll into round balls and store in an airtight container.
Health Benefits
- Protein & Fiber – Urad dal and rice combination gives balanced nutrition.
- Energy-rich – Ideal for festivals and kids’ snacks.
- Bone health – Urad dal provides calcium and magnesium.
- Digestive aid – Fiber supports healthy digestion.
- Iron boost – Helps improve hemoglobin levels.
Tips
- Roast rice and urad dal separately to avoid uneven cooking.
- For smoother texture, sieve the powder before mixing with jaggery.
- Use freshly made ghee for better taste.
- Adjust jaggery according to sweetness preference.
- Store in a cool, dry place for up to 2 weeks.
సున్నుండలు అనేది మినప్పప్పు, బియ్యం,బెల్లం (లేదా పంచదార), నెయ్యితో చేసే సంప్రదాయ ఆంధ్ర స్వీట్. సంక్రాంతి, దీపావళి వంటి పండుగలలో ఈ లడ్డూలు తప్పనిసరిగా తయారు చేస్తారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ స్వీట్ చిన్న పిల్లలకు చాలా మంచిది.
కావలిసిన పదార్దాలు
- మినప్పప్పు – 1 కప్పు
- బియ్యం – ¼ కప్పు
- బెల్లం – 1 కప్పు (పొడి)
- నెయ్యి – ½ కప్పు (వేడిగా)
- యాలకుల పొడి – ½ టీస్పూన్
తయారీ విధానం
- బియ్యం వేయించడం – పాన్‌లో బియ్యం వేసి తక్కువ మంటపై స్వల్ప బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- మినప్పప్పు వేయించడం – అదే పాన్‌లో మినప్పప్పును తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- చల్లార్చి పొడి చేయడం – పూర్తిగా చల్లారిన తర్వాత బియ్యం, మినప్పప్పు రెండింటిని కలిపి మెత్తగా పొడి చేయాలి.
- బెల్లం కలపడం – ఈ పొడికి బెల్లం పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- నెయ్యి కలపడం – క్రమంగా నెయ్యి పోసి కలిపి ముద్దలా చేయాలి.
- లడ్డూలు చేయడం – చిన్న చిన్న బంతులుగా చేయాలి.
సలహాలు
- బియ్యం, మినప్పప్పు వేర్వేరుగా వేయిస్తే రుచి బాగా వస్తుంది.
- మెత్తటి టెక్స్చర్ కోసం జల్లించాలి.
- తాజా నెయ్యి వాడితే రుచి మెరుగ్గా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
- ప్రోటీన్, ఫైబర్ కలిపి శక్తినిస్తుంది.
- పండుగలలో, పిల్లలకు మంచి శక్తివంతమైన స్నాక్.
- ఎముకల ఆరోగ్యానికి మంచిది.
- జీర్ణక్రియకు సహాయం చేస్తుంది.
- రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.