Thotakura Pappu is a nutritious and traditional South Indian dal made with protein-rich toor dal and iron-packed amaranth leaves. This simple, home-style dish is mildly tangy, slightly spicy, and pairs perfectly with steamed rice and a dollop of ghee. Apart from its comforting taste, it offers numerous health benefits—thotakura is rich in iron and folic acid, which help prevent anemia, and high in dietary fiber, aiding digestion and promoting gut health. It’s also a good source of calcium and magnesium for strong bones, and its antioxidant content supports immunity. Being low in calories and having a low glycemic index, it’s ideal for diabetic-friendly diets and natural detoxification.
Thotakura Pappu (Amaranth Leaves Dal) Recipe
Ingredients:
- Toor dal – ½ cup
- Thotakura (amaranth leaves) – 1 cup (finely chopped)
- Onion – 1 (chopped)
- Tomato – 1 (chopped)
- Green chillies – 2 (slit)
- Tamarind – small lemon-sized soaked pulp
- Turmeric powder – ¼ tsp
- Red chilli powder – ½ tsp
- Salt – as needed
- Water – as needed
For Tempering:
- Oil – 1 tbsp
- Mustard seeds – ½ tsp
- Cumin seeds – ½ tsp
- Garlic – 3 cloves (crushed)
- Dry red chillies – 2
- Curry leaves – few
Preparation Method:
- Wash toor dal and pressure cook it with turmeric and enough water for 3–4 whistles.
- In a pan, heat oil and add mustard seeds. Let them splutter.
- Add cumin seeds, garlic, dry red chillies, and curry leaves. Sauté for a few seconds.
- Add chopped onions, green chillies and sauté till translucent.
- Add tomatoes and cook until soft.
- Add the chopped thotakura and cook for 4–5 minutes till wilted.
- Pour in the tamarind extract, salt, and red chilli powder. Let it cook for 5 minutes.
- Add the cooked dal and mix well. Add water if needed to adjust consistency.
- Simmer for 5–10 minutes until well combined.
- Serve hot with steamed rice and ghee.
తోటకూర పప్పు అనేది ఆరోగ్యకరమైన పోషకాహారంగా ఉండే వంటకం. ఇది కందిపప్పుతో పాటు ఐరన్ పుష్కలంగా ఉండే తోటకూరను కలిపి తయారుచేసే సాంప్రదాయమైన దక్షిణ భారతీయ పప్పు. తేలికగా పుల్లగా, కాస్త మసాలాతో తయారయ్యే ఈ వంటకం వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. తోటకూరలో ఉన్న ఐరన్, ఫోలిక్ యాసిడ్ వల్ల రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అలాగే కాల్షియం, మగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న తోటకూర మధుమేహ బాధితులకు చాలా మేలు చేస్తుంది. అంతేకాదు శరీరానికి డిటాక్స్‌లా పనిచేస్తుంది.
తోటకూర పప్పు తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు:
- కందిపప్పు – ½ కప్పు
- తోటకూర – 1 కప్పు (సన్నగా కట్ చేయాలి)
- ఉల్లిపాయ – 1 (సన్నగా కట్ చేయాలి)
- టమాటా – 1 (కట్ చేయాలి)
- పచ్చిమిరపకాయలు – 2 (నులిపి వేయాలి)
- చింతపండు రసం – చిన్న నిమ్మకాయ పరిమాణం
- పసుపు – ¼ టీస్పూన్
- కారం – ½ టీస్పూన్
- ఉప్పు – తగినంత
- నీరు – తగినంత
తాలింపు కోసం:
- నూనె – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – ½ టీస్పూన్
- జీలకర్ర – ½ టీస్పూన్
- వెల్లుల్లి – 3 పళ్లు (ముద్ద చేయాలి)
- ఎండు మిరపకాయలు – 2
- కరివేపాకు – కొద్దిగా
- ఇంగువ – కొద్దిగా
తయారుచేసే విధానం:
- కందిపప్పును నీటితో కడిగి, పసుపు వేసి 3-4 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్‌లో వేయాలి.
- పాన్‌లో నూనె వేసి వేడి చేసిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
- జీలకర్ర, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, కరివేపాకు,ఇంగువవేసి వేయించాలి.
- ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
- టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి.
- తోటకూర వేసి 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి.
- చింతపండు రసం, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
- చివరగా ఉడికించిన కందిపప్పు కలిపి నీరు సరిచూసి మరికొంత వేయించి చిన్న మంటపై మరిగించాలి.
- వేడి వేడి అన్నంలోకి తాలింపు వేసిన తోటకూర పప్పు సర్వ్ చేయండి.
Leave a Reply